Ticker

6/recent/ticker-posts

వేమన శతకం - భాగం 1 (Vemana satakam part 1 )

వేమన శతకం - 1 వ భాగం 

పద్యం - 1

    చిత్త శుద్ది గలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కోదువ కాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వధాబిరామ వినురవేమ .

భావం :-
                   ఓ వేమనా ! మంచి బుద్ధితో కొన్ని మంచి పనులు చేసినా వాటిని తక్కువగా చూడకూడదు . అటువంటి మంచి పనులు ఎక్కువ ఫలితాన్నే ఇస్తాయి . మర్రి చెట్టు యొక్క విత్తనం చిన్నదైనను ఆ విత్తనం నుండి వచ్చే చెట్టు పెద్దది కదా !


  పద్యం - 2


ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల ?
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ  వినురవేమ.
భావం :-
                           ఓ వేమనా ! మన మనసులో మలినములుంచుకొని పాటించే ఆచారాల వలన ప్రయోజనం లేదు . పాత్రను శుభ్రపరచకుండా వండిన వంట ఏవిదంగా తినుటకు పనికిరాదో ఆదే విధంగా నిశ్చల మైన మనసుతో చేయని శివ పూజ వలన పుణ్యం లభించదు .  


పద్యం - 3

గంగిగోవుపాలు గరిటెడైనను చాలు 
కడివెడైననేమి ఖరమపాలు 
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు 
విశ్వదాభిరామ వినురవేమ   

భావం :-

               ఓ వేమనా ! మంచి ఆవు పాలు కొంచమైనను  త్రాగుటకు ఉపయుక్తముగానుండును . గాడిద పాలు కుండడు ఇచ్చినా త్రాగలేము కదా ! అలాగే ప్రేమతో పెట్టిన భోజనం పిడికెడైనను సంతోషమేగదా .

పద్యం - 4

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు 
తళుకు బెళుకు రాళ్ళు తట్టడేల
చాటు పద్యమిలను చాలదాయొక్కటి?
విశ్వదాభి రామ వినురవేమ .   

భావం :-

              ఓ వేమనా !  తళ తళ మెరిసే నకిలీ రాళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ వాటన్నిటికంటే ఒక్క శ్రేష్టమైన నీల రత్నం మేలి కదా ! అలాగే లోకంలో ఎన్ని పద్యములున్ననూ నీతి ని బోధించే  ఒక చాటు పద్యము గొప్పది కదా !

పద్యం - 5

   

మిరపగింజచూడ మీద నల్లగనుండు 
గొరికిచూడ లోన జురుకు మనును 
సజ్జనులగువారి సార మిట్లుండురా!   
విశ్వదాభిరామ వినురవేమ !

భావం :-

                   ఓ వేమనా ! మిరప గింజ చూచుటకు నల్లగా కనిపించిననూ కొరికితే నాలుక చురుక్కుమనును. అట్లాగే మంచి గుణములు గల మంచి వారు సామాన్యంగా కనిపించినప్పటికి వారిలో నిగూఢంగా గొప్ప ప్రభావం ఉండును .  


                                                                              వేమన శతకం  - భాగం 2  (vemana satakam - part 2)

Post a Comment

0 Comments