Ticker

6/recent/ticker-posts

kaalamu (bhuta bhavisyat vartamana taddharma kalamulu ) భూత , భవిశ్యత్, వర్తమాన , తద్ధర్మ కాలములు . tenses in telugu language


కాలములు

                      పని  ఏ సమయo లో జరుగుతుందో తెలిపేది కాలము . ఈ కాలములు తెలుగు భాషలో నాలుగు రకములుగా చెప్పబడుతున్నవి. 1) వర్తమాన కాలము 2) భూత కాలము 3) భవిష్యత్ కాలము 4) తద్ధర్మ కాలము.
1.వర్తమాన కాలము :  పని అప్పుడు జరుగుతూ ఉన్నట్టు తెలిపే కాలాన్ని వర్తమాన కాలము అని అంటారు .
ఉదా : నేను తెలుగు పుస్తకం చదువుతున్నాను .
          సరస్వతి వంట చేస్తుంది .
          కల్యాణ్ గణేశ్ ఆటలు ఆడుతున్నాడు .
2.భూత కాలము : పని మున్దుగానే జరిగిపోయినట్టు తెలిపే కాలాన్ని భూత కాలము అని అంటారు .
ఉదా : నేను నిన్న సినిమాకు వెళ్ళాను .
         శ్రీ కృష్ణ పాఠశాలకు వెళ్ళాడు .
         సరస్వతి పాటలు పాడింది .
3.భవిష్యత్ కాలము : జరగబోయే పనిని తెలిపే కాలాన్ని భవిష్యత్ కాలము అని అంటారు .
        ఉదా : వర్షం వస్తుంది .
                 నేను పాఠం చెపుతాను .
                 తాత గారు కథలు చెపుతారు .
4. తద్ధర్మ కాలము : ఎల్లపుడూ జరిగే పనిని గురించి తెలియజేసే కాలాన్ని తద్ధర్మ కాలము అని అంటారు .
ఉదా : సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు .
         నేను పాలు తాగుతాను .
         అమ్మ పాటలు బాగా పాడుతుంది .


Post a Comment

0 Comments