How to clay potted water is cool?
మట్టికుండ
లో నీరు చల్లగా ఉంటుంది ఎందుకు?
వేసవి కాలంలో
దాహర్తి తీర్చుకోడానికి చల్లని నీరు
లేదా చల్లని పానీయాలు త్రాగుతాం .
ప్రస్తుత కాలం లో చల్లని పానీయాలంటే ఫ్రిజ్ లో ఉంచి చల్లబరచిన పానీయాలు
త్రాగుతున్నాం . కానీ ఫ్రిజ్ లో ఉంచిన
చల్లని పానీయాలు త్రాగడం వలన అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నం . మరి పూర్వకాలం లో
చల్లని నీరు త్రాగాలంటే ఏం చేసేవారు ? మట్టి
కుండ లో నీరు త్రాగే వారు.
మట్టికుండ లో నీరు చల్లగా ఉంటుంది ,దాహర్తిని తీరుస్తుంది ,
ఆరోగ్యాన్నిస్తుంది .
మరి
మట్టికుండ లో నీరు ఎలా చల్లబడుతుంది?
నీరు ఎలా చల్లబడుతుందో తెలుసుకోవాలంటే
ముందుగా భాష్పీభవనం అంటే ఏమిటో తెలుసుకోవాలి . ఎప్పుడైనా మన చేతులపై
పెట్రోల్ గాని స్పిరిట్ గాని పడితే చల్లని అనుభూతిని పొందుతాము . అంటే పెట్రోల్
గాని స్పిరిట్ గాని చల్లగా ఉంటుందా ? కాదు సాదారణ గది ఉష్ణోగ్రత వద్ద పెట్రోల్ గాని
స్పిరిట్ గాని ఆవిరి అయిపోతుంది . అలా
ఆవిరి కావడాన్నే భాష్పీభవనం . ఇలా భాష్పీభవనం చెందడం వలన ఆ పదార్దం ఉష్ణోగ్రత తగ్గుతుంది . అలా తగ్గడం వలన పెట్రోల్
గాని స్పిరిట్ గాని చేతికి తగలగానే చల్లని అనుభూతి కలుగుతుంది .
అంటే
భాష్పీభవనం వలన ద్రవాల ఉష్ణోగ్రత తగ్గుతుంది .
మట్టికుండ లో నీరు చల్లగా ఎలా మారుతుంది ?
మట్టికుండను
బంకమట్టితో చేసి కాల్చుతారు . ఇలా కాల్చడం వలన మట్టికుండకు సూక్ష్మ రంద్రాలు
ఏర్పడతాయి. మనం మట్టి కుండలో నీరు పోసినపుడు కుండ ఉపరితలం పై తడి గమనించవచ్చు .ఈ
తడి ఎలా వచ్చిందంటే లోపల గల నీరు మట్టి కుండ
గోడలకున్న సూక్ష్మ రంద్రాల ద్వారా
వెలుపలికి వస్తుంది . ఇది తక్కువ
పరిమాణంలో ఉంటుంది. ఇలా వచ్చిన నీరు గాలి వలన భాష్పీభవనం చెంది కుండ గోడలను
చల్లబరుస్తుంది . ఈ చల్లదనం నీరు గ్రహించి చల్లబడుతుంది. ఈ విధమైన నిర్మాణం లోహపు
పాత్రలలో ఉండదు కాబట్టి లోహపు ( రాగి , ఇత్తడి , స్టీల్ )
కుండలలో నీరు చల్లబడదు .
https://youtu.be/vfr_slEZGrA?t=15
2 Comments
good information
ReplyDeletethank you
Delete