Ticker

6/recent/ticker-posts

Why sky is blue in colour?


Why sky is blue in color
ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది?
                      మన భూమి చుట్టూ వాతావరణం ఒక పొరలా కమ్ముకొని ఉంది. ఇందులో నత్రజని , ప్రాణవాయువు (ఆక్సీజెన్ ),బొగ్గుపొలుసు వాయువు ,ధూళి కణములు ,నీటిఆవిరి, మరియు ఇతర వాయువులు కలిసి ఉంటాయి .
                సూర్య కాంతి ఈ వాతావరణం గుండా ప్రయాణిస్తుంది . సూర్య రశ్మి వాతావరణం లోనికి ప్రవేశించినపుడు ధూళి కణములపైన  , నీటి కణముల పైన పడుతుంది . ఈ కణములు సూర్య రశ్మిని వివిధ దిశలకు  పరవర్తనం చెందిస్తాయి.   ఈ కారణం చేతనే సూర్యోదయం తరువాత అన్నీ దిశలకు కాంతి వ్యాపిస్తుంది .  సూర్యోదయం ముందు ,తరువాత కూడా వెలుగును పొందడాని ఈ ధూళి కణములు , నీటి కణములు అన్నిఓ దిశలకు కాంతిని పరవర్తనం చెందించడమే కారణం.
                 సూర్య కాంతి ఏడు రంగుల కలియక అని మనందరికీ తెలుసు . ఆ ఏడు రంగులు ఊదా ,నీలం, ఇంద్ర నీలం , ఆకు పచ్చ , పసుపు పచ్చ , నారింజ , మరియు , ఎరుపు . సూర్య కాంతి వాతావరణం లోని ధూళి కణములను ,నీటి కణములను తాకినపుడు సూర్య కాంతి లోని ఊదా రంగు , నీలం రంగు , ఇంద్ర నీలం రంగులు ఎక్కువగా పరవర్తనం చెందుతాయి. .మనం ఆకాశం వంక చూసినపుడు మన కంటికి కనిపించే కాంతిలో ఉదా  , నీలం, ఇంద్ర నీలం రంగులే ఎక్కువగా ఉంటాయి . ఈ మూడు రంగుల కలియక వలనే నీలం రంగు ఏర్పడుతుంది .కాబట్టి మనకు ఆకాశం నీలంగా కనబడుతుంది.     

భూమి పై వాతావరణం లేకపోతే ఆకాశం నల్లగా కనబడేది . చంద్రుని పై వాతావరణం లేదు కాబట్టి చంద్రునిపై నుండి చూస్తే ఆకాశం నల్లగా కనిపిస్తుంది . అంతరిక్షం  లో కూడా ఈ విధంగా ధూళి కణములు ,నీటి కణములు  ఉండవు కాబట్టి అంతరిక్షం నుండి చూస్తే  ఆకాశం నల్లగా కనిపిస్తుంది .
Watch this video for more information.



Post a Comment

0 Comments