How mirages are formed?
ఎండమావులు ఎలా ఏర్పడతాయో తెలుసా ?
వేసవి కాలంలో నున్నటి తారురోడ్డుపై వాహనం లో ప్రయాణిస్తున్నపుడు అక్కడక్కడ నీరు ఉన్నట్టు
కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది.తీరా అక్కడకు వెళ్ళేసరికి నీరు ఉండదు .అలాగే మండు వేసవికాలం
లో ఎడారిలో కూడా ఇలాగే నీరు ఉన్నట్టు కనబడతాయి కానీ అక్కడ ఒక్క చుక్క నీరు కూడా ఉండదు . దీనినే
ఎండమావి (మృగ తృష్ణ) అంటారు . ఎడారిలో జంతువులకు కూడా ఇటువంటి భ్రమ కలుగుతుంది
.కొన్ని సందర్భాలలో జంతువులు నీటికోసం ఎందమవులను చూసి భ్రమపడి తిరిగి తిరిగి నీరు దొరకక
చనిపోతాయి .
మరి
ఎండమావులు ఎలా ఏర్పడతాయో మీకు తెలుసా ?
ఎండమావులు
కాంతి యొక్క అంతర్ పరివర్తనము వలన ఏర్పడతాయి
. అంతర్పరివర్తనము అంటే కాంతి ఎక్కడ నుండి వచ్చిందో అక్కడకే పరావర్తనము చెందడము . వేసవిలో
భూమి ఉపరితలము బాగా వేడెక్కుతుంది . భూమి ఉపరితలానికి దగ్గరలో నున్న గాలి కూడా వేడెక్కుతుంది.
కానీ పై పొరలలో ఉన్న గాలి చల్లగానే ఉంటుంది . వేడి గాలి చల్ల గాలి కంటే తేలికగా ఉంటుంది
. కనుక పై పొరల కంటే భూమి ఉపరితలం తేలికవుతుంది . అంటే భూమి వేర్వేరు సాంద్రతలు గల
పొరలుగా మారుతుంది . అందువలన కాంతి ఆ పొరల
గుండా ప్రసరించినపుడు కాంతి మార్గము ఋజుమార్గము నుండి వంపు
తిరుగుతుంది. దీనినే కాంతి వక్రీభవనము అంటారు.
0 Comments