ఆకు ఎగిరి ముల్లు మీద పడ్డా, ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా, చిరిగేది ఆకే
ఆస్తి మూరెడు ఆశ బారెడు
అబద్దమైనా అతికినట్టు ఉండాలి
అద్దం అబద్ధం చెప్పదు
అగ్నికి వాయువు తోడైనట్లు
పిచుక మీద బ్రహ్మాస్త్రం
మింగటానికి మెతుకు లేదు కాని మీసానికి సంపెంగ నూనె
పొరుగింటి పుల్ల కూర రుచి
అందితే జుట్టు అందక పోతే కాలు
ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది
వీధిలో పులి ఇంట్లో పిల్లి
తూర్పు తిరిగి దండం పెట్టు
మొదటికే మోసం మొగుడా అంటే పెసరపప్పు పెళ్ళామా అన్నట్టు
ఇల్లలకగానే పండగ కాదు
ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరగక చెడతాడు
మోసే వాడికి తెల్సు కావడి బరువు
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది
ఊళ్ళో పెళ్ళి కి కుక్కల హడావిడి.
అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
అప్పు చేసి పప్పు కూడు
అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
బతికుంటే బలుసాకు తినవచ్చు
భక్తి లేని పూజ పత్రి చేటు
బూడిదలో పోసిన పన్నీరు
చాదస్తపు మొగుడు చెబితే వినడు,గిల్లితే యేడుస్తాడు
చాప కింద నీరులా
చచ్చినవాని కండ్లు చారెడు
చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
విద్య లేని వాడు వింత పశువు
చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
చక్కనమ్మ చిక్కినా అందమే
చెడపకురా చెడేవు
చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
చింత చచ్చినా పులుపు చావ లేదు
చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
చిలికి చిలికి గాలివాన అయినట్లు
డబ్బుకు లోకం దాసోహం
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
దాసుని తప్పు దండంతో సరి
దెయ్యాలు వేదాలు పలికినట్లు
దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
దొంగకు తేలు కుట్టినట్లు
దూరపు కొండలు నునుపు
దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
దురాశ దుఃఖమునకు చెటు
ఈతకు మించిన లోతే లేదు
ఎవరికి వారే యమునా తీరే
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
గాజుల బేరం భోజనానికి సరి
గంతకు తగ్గ బొంత
గతి లేనమ్మకు గంజే పానకం
గోరు చుట్టు మీద రోకలి పోటు
గొంతెమ్మ కోరికలు
గుడ్డి కన్నా మెల్ల మేలు
గుడ్డి యెద్దు చేలో పడినట్లు
గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
గుడ్ల మీద కోడిపెట్ట వలే
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
గురువుకు పంగనామాలు పెట్టినట్లు
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
ఇంటికన్న గుడి పదిలం
Post a Comment
0
Comments
Followers
PRIMARYSCHOOL is a digital library to learn Telugu , English , Mathematics , Science , Social , General knowledge
and so many things in easy and play way method .These are
very useful to children who are studying LKG to 10 class and preparing for competitive exams .మీరు ఈ website ను సందర్శించినందుకు ధన్యవాదములు. మీ యొక్క అమూల్యమైన సలహాలు,సూచనలు మాకెంతో ఆనందదాయకం .
PRIMARYSCHOOL is a digital library to learn Telugu , English , Mathematics , Science , Social , General knowledge and so many things in easy and play way method .These are very useful to children who are studying LKG to 10 class and preparing for competitive exams
0 Comments