Ticker

6/recent/ticker-posts

భాషాభాగములు (Parts of speech in telugu language)

భాషాభాగములు

                                     
                       తెలుగు భాషలోని పదములు ఐదు భాగములుగా విభజించబడినవి.
1.నామవాచకము ,2. సర్వనామము , 3.విశేషణము , 4. క్రియ , 5. అవ్యయము. 
1) నామవాచకము : పేర్లను తెలిపే పదాలను  అనగా మనుష్యుల పేర్లు , జంతువుల పేర్లు , వస్తువుల పేర్లు , ప్రదేశాల పేర్లు  మొదలగువాటిని  తెలిపే పదాలను నామవాచకాలు అంటారు . (వీటిని విశేష్యములు అని కూడా అంటారు .)
ఉదా: రాముడు, ఏనుగు , హిమాలయం , రాయి .  
   నామవాచకాలు మరళా మూడు రకాలుగా విభజించారు.
1) జాతి నామవాచకాలు : జాతిని తెలిపే పదాలను జాతి నామవాచకాలు అంటారు.
ఉదా:  పులి , ఏనుగు, నది ,కొండ
2) గుణ నామవాచకాలు : గుణములను తెలిపే పదాలను గుణ నామవాచకాలు  అంటారు.
ఉదా: భయం , తీపి , పొడవు .
3) సంజ్ఞా  నామవాచకాలు : వస్తువు యొక్క గాని,   మనిషి యొక్క గాని , జంతువు యొక్క గాని పేరును తెలిపేది సంజ్ఞా  నామవాచకం .
ఉదా: రాముడు , భీముడు , సరస్వతి.
2) సర్వనామం : నామవాచకలకు బదులుగా వాడే పదాలను సర్వ నామాలు అంటారు . 
ఉదా : నీవు , మీరు , వారు , ఆమె ,అది ,మొదలుగునవి .
3) విశేషణము : నామవాచకముల యొక్క గుణములను తెలిపే పదాలను విశేషణములు అంటారు . గుణములనగా రంగు ,రుచి ,వాసన , పరిమాణము , మొదలుగునవి.
ఉదా :  నల్ల పిల్లి ,
        పుల్లని మామిడి
        మంచి బాలుడు   
ఈ పదాలలో గీత గీసిన పదములు నామవాచకం యొక్క గుణమును తెలియ జేస్తున్నాయి.
“నల్ల పిల్లి “ లో  పిల్లి విశేష్యం (నామవాచకం ) , నల్ల విశేషణం .
4) క్రియ :  కర్త చేసే పనిని తెలియజేసే పదాలను క్రియలు అంటారు .
  ఉదా :  నేను చదువుచున్నాను .
         రాముడు  వేటకు వెళ్ళాడు .

వచ్చాడు , వెళ్ళాడు , ఎగరడం , గెంతడం , కొనడం , అమ్మడం, మొదలుగునవి.

ఈ క్రియలు 1) సమాపక క్రియలు 2) అసమాపక క్రియలు అని రెండు రకాలు  ఉంటాయి.

1)సమాపక క్రియ : వాక్యము పూర్తి అవుతుంది. అంటే పూర్తి ఆర్ధాన్ని ఇస్తుంది . 

ఉదా: సరస్వతి పూలు కొసింది .
      హర్ష పాఠశాలకు  వెళ్లింది . ఈ వాక్యాలలో పని పూర్తి అయిందని అర్థం అవుతుంది.
2)అసమాపక క్రియ :  పూర్తి అర్థము ఇవ్వని క్రియలను అసమాపక క్రియలు అంటారు . అంటే వాక్యము పూర్తి కాదు .
ఉదా:  వెళ్ళి , వచ్చి ,చదివి ,  తిని , మొదలుగునవి .
1.    నేను  అన్నం తిని బడికి వెళ్ళాను . ఈ వాక్యo లో  తిని” అసమాపక క్రియ , “వెళ్ళాను సమాపక క్రియ .
సాధారణంగా వాక్యము అనగానే  కర్త ,కర్మ ,  క్రియ అనే మూడు భాగాలు  ఉంటాయి .  కొన్ని సంధర్భాలలో కొన్ని క్రియలకు  కర్మ ఉంటుంది వాటిని సకర్మక క్రియలు అంటారు  . కొన్ని క్రియలకు కర్మ ఉండదు  వాటిని అకర్మక క్రియలు  అంటారు .
1.    సకర్మక క్రియలు  :  లత బొమ్మలు వేసింది .
                              రాముడు మొక్కలు నాటెను .
2.   అకర్మక క్రియలు :  వర్షం పడింది .
                           సుష్మ  వచ్చింది .

5.అవ్యయము :  లింగ ,వచన , విభక్తి , కాలము లేని దానిని అవ్యయము అంటారు .
1. లింగము :  స్త్రీ లింగామా ? పుం లింగామా ? నపుంసక లింగామా ? అని చెప్పలేనిది
2. వచనము : ఏక వచనామా ? బహు వచనామా ? అని చెప్పలేనిది?
3. విభక్తి : ప్రథమా, ద్వితీయా ,అనే మొదలగు విభక్తులు చెప్పలేనిది .
4. పురుషము : ప్రథమా ,మద్యమా , ఉత్తమా  అని చెప్పలేనిది.
5.కాలము :  భూత కాలమా ?వర్తమాన కాలమా ? భవిష్యత్ కాలమా? అని చెప్పలేనిది .
     ఈ విధంగా లింగ , వచన , విభక్తి , కాలము లేనిది ,పై వాటి వల్ల ఏ విధమైన మార్పు చెందనిది  అవ్యయము  
 ఉదా: ఆహా !  భలీ ! ఓహో !  అయ్యో!   మొదలుగునవి

Post a Comment

0 Comments