కాకి కాకి గువ్వల కాకి - కాకి నాకు ఈకా ఇచ్చే
ఈకా తెచ్చి దిబ్బకు ఇస్తే - దిబ్బా నాకు ఎరువు ఇచ్చే
ఎరువూ తెచ్చి చేలో వేస్తే - చేనూ నాకు గడ్డీ ఇచ్చే
గడ్డీ తెచ్చి ఆవుకు ఇస్తే - ఆవు నాకూ పాలూ ఇచ్చే
పాలు తెచ్చి పంతులుకిస్తే - పంతులు నాకు పాఠం చెప్పే
0 Comments