Ticker

6/recent/ticker-posts

నేటి పద్యం : చిత్త శుద్ది గలిగి చేసిన పుణ్యంబు



చిత్త శుద్ది గలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కోదువ కాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వధాబిరామ వినురవేమ 




భావం:- వేమనా ! మంచి బుద్ధితో కొన్ని మంచి పనులు చేసినా వాటిని తక్కువగా చూడకూడదు . అటువంటి మంచి పనులు ఎక్కువ ఫలితాన్నే ఇస్తాయి . మర్రి చెట్టు యొక్క విత్తనం చిన్నదైనను ఆ విత్తనం నుండి వచ్చే చెట్టు పెద్దది కదా !

Post a Comment

0 Comments