కోతి పంపకం
అనగనగా ఒక ఊర్లో రెండు పిల్లులు ఉండేవి. ఒక రోజు వాటికి ఒక రొట్టె దొరికింది. రెండు పిల్లులు నాకే పెద్ద ముక్క కావాలి, నాకే పెద్ద ముక్క కావాలి అని పొట్లాడుకుంటున్నాయి. ఈ తగాదా అంతా ఒక కోతి చూసింది. పిల్లుల్లారా పిల్లుల్లారా మీరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని అడిగింది. అందుకు ఒక పిల్లి నేనే రొట్టెను ముందు పట్టుకున్నాను అందువలన నాకే పెద్ద ముక్క కావాలి అని అంది. రెండవ పిల్లి నేనే రొట్టెను ముందు పట్టుకున్నాను అందువలన నాకే పెద్ద ముక్క కావాలి అని అంది.
ఓహో అలాగా అయితే మీ ఇద్దరికీ రొట్టె దొరికింది . కాబట్టి మీరిద్దరూ సమానంగా పంచుకోండి అని అంది కోతి. కానీ పిల్లులూ మీరు సమానంగా పంచుకోలేరు కాబట్టి నేనే మీ ఇద్దరికీ సమానంగా పంచుతాను ఆ రొట్టెను ఇలా ఇవ్వండి. అని కోతి ఆ రొట్టెను తీసుకుంది .
కోతి రొట్టెను రెండు ముక్కలు చేసింది. ఆ రెండు ముక్కలు సమానంగా లేవు. అయ్యో సమానంగా ముక్కలు కాలేదు అని ఒకటవ ముక్కను కొద్దిగా కొరికింది. ఈసారి రెండవ ముక్క పెద్దదిగా ఉంది. అయ్యో రెండవ ముక్క పెద్దదిగా ఉంది అని రెండవ ముక్కను కొద్దిగా కొరికింది. ఈసారి మొదటి ముక్క పెద్దదిగా ఉంది. ఇలా రొట్టెను మొత్తం తినేసింది కోతి. రెండు పిల్లులు బేల మొహాలు వేసుకొని, కోతి మనలను మోసం చేసిందని తెలుసుకొని మరెప్పుడూ పొట్లాడకూడదని కలిసికట్టుగా వెళ్లిపోయాయి.
నీతి:- ఇద్దరు పొట్లాడుకుంటే మూడవవ్యక్తి లాభం పొందుతాడు.
Click here to Watch this video
0 Comments