అనగనగా ఒక అడవి. అడవికి రాజు సింహం. ఆ అడవిలో అనేక రకాల జంతువులు పక్షులు హాయిగా నివసిస్తున్నాయి. ఒకరోజు సింహం చెట్టుకింద పడుకుంది. అక్కడకి ఒక ఒక చిట్టెలుక వచ్చింది. ఆ చిట్టెలుక సింహం పైకి ఎక్కి అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటుంది. అలా ఆడుకుంటూ సింహం చెవిని కొరికింది. సింహానికి మెలుకువ వచ్చి చూసే సరికి , ఏమీ కనబడలేదు. మళ్లీ సింహం కునుకు తీసింది. మళ్లీ చిట్టెలుక సింహం చెవి కొరికింది. ఈ సారి సింహానికి చిట్టెలుక చిక్కింది. సింహం కోపంతో ఓహో చిట్టెలుకా నాతోనే పరాచికాలా . నిన్ను చంపేస్తా అంటూ ఘర్జించింది. చిట్టెలుక భయం తో వణికికిపోయింది. మృగరాజ నన్ను క్షమించు ., నీకేపుడైనా ఆపద సమయంలో సహాయం చేస్తాను. అని చిట్టెలుక ప్రాధేయ పడింది. అపుడు సింహం హా హ్హ హా నీవా ఈ మృగరాజు ను కాపాడేది. పో ఈ దగ్గరలో ఇంకెప్పుడూ కనపడవద్దు. అని చిట్టెలుకను మందలించి విడిచిపెట్టింది.
కొంతకాలం తర్వాత ఒక వేటగాడు ఆ అడవికి వేటకు వచ్చాడు. ఆ వేటగాడు వేసిన వలలో సింహం చిక్కుకుంది. చిట్టెలుక వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది. అయ్యో ఎంత ఘోరం జరిగింది ఈ సింహాన్ని ఎలాగైనా కాపాడాలని అనుకొని చిట్టెలుక వలను కొరికి సింహాన్ని రక్షించింది. అపుడు సింహం చిట్టెలుకా నిన్ను చాలా చిన్న చూపు చూసాను. ఈ రోజు నీవు లేకుంటే నా ప్రాణాలు పోవలిసిందే. నన్ను రక్షించావు. నీకెంతో ఋణపడి ఉంటాను. నా రాజ్యం లో చిన్నా పెద్ద ఏ జంతువు ను కూడా తక్కువగా చూడకూడదని నాకు అర్దం అయింది. అని ఆంది.
0 Comments