sumati sataka padyyalu with bhavam upakkaiki nupakaaramu
నేటి పద్యం
ఉపకారికి నుపకారము
విపరీతము గాదుసేయ , వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ
కఠిన పదాలు – అర్ధాలు
ఉపకారికి = ఉపకారము చేసినవాడికి , ఉపకారము = ప్రత్యుపకారము ,
చేయన్ = చేసినచో
విపరీతముకాదు = వింతైన సంగతి కాదు , వివరింపంగా = ఆలోచించంగా ,
అపకారికిన్ = తనకు అపకారము చేసిన వానికి కూడా , నెపము =
వెనుకటి తప్పును
ఎన్నక = ఎంచక , ఉపకారము చేయువాడు = తగిన సహాయం చేయువాడు ,
నేర్పరి = ఉత్తముడు .
భావం :- ఓ సుమతీ ! ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం
చేయడం విశేషము కాదు. కానీ
అపకారము చేసిన వాడికి కూడా వాని యొక్క తప్పులను ఎంచక
సహాయం చేసే వాడు ఉత్తముడు.
0 Comments