sumathi sathaka padyaalu with bhavam immuga jaduvani norunu
నేటి పద్యం ఇమ్ముగ జదువని నోరును అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్ తమ్ముల మబ్బని నోరును కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ !
కఠిన పదాలు – అర్ధాలు
సుమతీ = మంచి బుద్ధి గలవాడా ! ఇమ్ముగా = చక్కగా, చదవని నొరున్ = చదువులు నేర్వని నోరు
అమ్మాయని పిలిచి = అమ్మా అని తల్లిని పిలిచి , అడుగని నోరున్ = అడగనటువంటి నోరు,
తమ్ములము = తాంబూలము , అబ్బని నోరును = తాంబూలము పండని నోరు , కుమ్మరి = కుమ్మరి ,
మను = మన్ను , త్రవ్వినట్టి = త్రవ్వగా ఏర్పడినట్టి , గుంట = గొయ్యి .
ఓ సుమతీ ! చిన్నపటి నుండి చక్కని చదువులు చదవని నొరునూ , అమ్మా యని పిలిచి అన్నమడుగు భాగ్యము లేని నోరును , తాంబూలము వేయని నొరునూ అనగా తాంబూలము వేసినా పండని నోరునూ , కుమ్మరి మన్ను త్రవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది అనగా నిరుపయోగమైనది.
share comment like
0 Comments