1. తిరిగి తోక లేని పిట్ట తొంభై ఊర్లు తిరిగింది ఏమిటది?................... ఉత్తరం .
2. కర్ర కాని కాని కర్ర ఏమిటది?.................................................... జీలకర్ర
3. రాణి కాని రాణి ఏమిటది ?........................................................పారాణి.
4. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తై తక్కలాడింది.
............................................................................................ కవ్వం
5. తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్న మాణిక్యాలు ...... . పనస పండు
6. రెండు గుర్రాలకు ఒకడే రాజు............................................. .. చెప్పులు
7. కిట కిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెరిచిన చప్పుడు కావు.
............................................................................................ కళ్ళు 8 . తెల్లని పొలం లో నల్లని విత్తనాలు చేత్తో చల్లు తారు నోటితో ఏరు తారు .
...................................................................................... పుస్తకం
9. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం .........................................తేనె పట్టు
10. అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది. .......దీపం వత్తి
11. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు? ..........................ఉల్లిపాయ
12. చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ? ...........................కజ్జికాయ
13. వాలం ఉంది కాని కోతిని కాదు, నామముంటుంది కాని
పూజారిని కాదు? ..............................................................ఉడుత
0 Comments