దురాశ దుఃఖానికి చేటు
బంగారు బాతు గుడ్డు కథ
రామాపురం అనే గ్రామం లో సోమయ్య అనే రైతు ఉండేవాడు . అతను ఒక రోజు పొలం నుండి వస్తుండగా ,ఒక బాతు కనిపించింది . అది అన్ని బా తుల్లా కాకుండా కొంచం వింతగా ఉంది . ఇటువంటి బాతును పెంచుకోవాలని , రామయ్య దానిని ఇంటికి తీసుకు వెళ్ళాడు . ఆ బాతును గంపకింద దాచాడు . ఉదయం బతుకు ఆహరం ఇవ్వటానికి గంప పైకి తీసాడు . గంప కింద మిలమిలా మెరుస్తూ ఒక చిన్న బంగారు గుడ్డు కనిపించింది . ఆహ ! ఎంత అదృష్టం . ఈ బాతు రోజు ఇలాగే బంగారు గుడ్లు పెడితే ఎంత బాగుంటుంది. అని అనుకున్నాడు సోమయ్య . ఆ బాతు అలాగే రోజూ బంగారు గుడ్డు పెట్టేది . ఒక రోజు సోమయ్య కు ఒక ఆలోచన వచ్చింది . ఈ బాతు రోజుకో గుడ్డు మాత్రమే పెడితే నేనెప్పటికీ ధనవంతుడనౌతాను , దీని పొట్ట కోసి మొత్తం బంగారమంతా ఒకేసారి తీసుకుంటాను అని అను అనుకున్నాడు .. అనుకున్నదే తడవుగా కత్తి తీసి బాతు పొట్ట కోశాడు . బాతు పొట్టలో బంగారమూ లేదు , బాతుగుడ్డు లేదు .రోజు బంగారు గుడ్లను ఇచ్చే బంగారు బాతును పోగొట్టుకొన్నం దుకు, సోమయ్య తన దురాశకు తగిన శాస్తి జరిగిందని నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చాడు .
నీతి : దురాశ దుఃఖానికి చేటు
0 Comments