Ticker

6/recent/ticker-posts

SATYAMEVA JAYETE (A COW'S STORY)

   సత్యమేవ జయతే 

              అనగనగా ఒక అడవి . ఆ అడవికి దగ్గరలో ఒక ఊరు ఉంది. ఆ  ఊరిలో రామయ్య వద్ద ఒక ఆవు ఉండేది . అది చాలా మంచిది . ఒక నాడు అది ఆవుల మందతో అడవిలోకి మేతకు వెళ్ళింది. ఆవులన్ని తలో దిక్కుకు వెళ్ళాయి .  కొంత సమయం తరువాత ఒక పెద్ద పులి ఈ అవును పట్టుకుంది . పులికి  కొంతకాలం నుండి ఆహారం లేకపోవటం వలన ఆవు దొరికే సరికి చాలా సంతోషించింది . ఆవు ఆవు  నిన్ను నేను తినేస్తాను .  చివరి  సారిగా నీకు నచ్చిన   దైవాన్ని తలుచుకో అంది పెద్దపులి .                పులి రాజా ! నన్ను క్షమించండి . నాకు ఇంటి వద్ద ఒక చిన్న లేగ దూడ ఉంది . తనకు మంచి చెడ్డ ఏమీ కూడా తెలియదు . నేను ఇంటికి వెళ్లి బుద్దులు చెప్పి కడుపునిండా పాలు  ఇచ్చి తోటి ఆవులకు తనను అప్పజెప్పి వెంటనే తిరిగి వస్తాను . అప్పుడు నన్ను తృప్తిగా తిందువు గాని ,ఒక్కసారి నేను ఇంటికి వెళ్లేందుకు అనుమతినివ్వు అని ఆవు ప్రాధేయపడింది .               పులి ఒక్కసారిగా గట్టిగ నవ్వి నేనేమైన  వెర్రివాడిగా కనిపిస్తున్నానా ? నీవు ఇంటికి వెళితే మరలా తిరిగి వస్తావా? చాలా  ఆకలిగా ఉన్నాను నిన్నెలా వదులుకుంటాననుకున్నావు?అని అంది పులి. ఆవు ప్రాధేయపడుతూ నన్ను నమ్మండి ,నేనెప్పుడూ అసత్యమాడలేదు వెంటనే  తిరిగి వస్తాను అంది. పులికి ఆవును నమ్మాలనిపించి , దూడకు పాలిచ్చి వెంటనే వచ్చేయమని పంపించింది .        అప్పటికే తన  తల్లి కోసం ఎదురు చూస్తుంది లేగదూడ. ఆవు పరుగు పరుగున ఇంటికి  వచ్చి  దూడకు పాలిచ్చి బుద్దులు చెప్తుంది . అమ్మా ఇప్పుడు ఎందుకు నాకు చెపుతున్నావు? అని దూడ అడిగింది. బిడ్డా నేను పులికి వస్తాననీ మాట ఇచ్చాను .ఆడిన మాట తప్పకూడదు . నీకు నేను మరి లేను . నిన్ను మిగిలిన ఆవులకు అప్పచెపుతాను . జాగ్రత్తగా నడుచుకో తల్లి ఇప్పటికే ఆలస్యం అయింది . పులి రాజు కు  కోపం వస్తుందేమో వస్తాను తల్లి అని  చెప్పి ఆవు పులి దగ్గరకు వెళ్ళింది.        పులి   ఆవుతో  ఆవూ నీవు ఏంతో  సత్యసంధురాలవు . నీలాంటి అవును చంపి పాపం మూటకట్టుకోలేను . ఆకలితో నైనా  చస్తాను గాని నిన్ను చంపలేను ,నీవు వెళ్లి నీ బిడ్డ తో సుఖంగా జీవించు అని ఆవును పంపించింది పులి.         ఆవు ఆనందంతో ఇంటికి వెళ్ళింది . దూడ  తన తల్లి ఇంటికి రావడం తో  ఎంతో ఆనందించింది. చూసారా బాలలు ! సత్యం ఎంతటి దుర్మార్గుడినైనా మార్చగలదు . అందుకే సత్యమేవ జయతే అని పెద్దలన్నారు . 

                    

           

Post a Comment

0 Comments