ఏడు చేపల కథ
అనగనగా ఒక రాజు . ఆ రాజు కు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్లారు . వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చారు . ఏడూ చేపలను ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు.
చేపా చేపా ఎందుకు ఎండలేదు?దుబ్బు చాటు వచ్చింది .దుబ్బు దుబ్బు ఎందుకు చాటు వచ్చావు?ఆవు నన్ను మేయలేదు .ఆవు ఆవు ఎందుకు మేయలేదు?పోలిగాడు విప్పలేదు.పోలిగా పోలిగా ఎందుకు విప్పలేదు?అవ్వ బువ్వపెట్టలేదు.అవ్వా అవ్వా ఎందుకు బువ్వ పెట్టలేదు?పిల్లాడు ఏడుస్తున్నాడు.పిల్లాడా పిల్లాడా ఎందుకు ఏడుస్తున్నావు?నాకు నాకు చీమ కుట్టింది?చీమా చీమా ఎందుకు కుట్టావు ?నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా మరి.
0 Comments